వణికించిన మున్నెరువాగు.. స్థానికుల సాయంతో 9 మంది సేఫ్!

-

తెలంగాణ, ఆంధ్రా సరిహద్దులో ఉన్న ఖమ్మం జిల్లాలో భారీ వర్షాల కారణంగా మున్నెరువాగు ఉగ్రరూపం దాల్చింది. దీంతో లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమయ్యాయి. ఈ క్రమంలో 9 మంది మున్నెరు వాగు బ్రిడ్జిపై చిక్కుకున్నారు.సాయం కోసం వీరు ఎంతో ఎదురుచూశారు. ప్రభుత్వం తరఫున వీరికి ఎటువంటి సహాయ సహకారాలు లభించలేదు. కానీ స్థానికులే ధైర్యం చేసి వీరిని రక్షించారు.

ఖమ్మం జిల్లా ప్రకాశ్ నగర్ మున్నేరువాగులో బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మంది స్థానికుల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. వరదల్లో చిక్కుకున్న వారిని జేసీబీల సాయంతో క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. తమను ఎవరూ పట్టించుకోలేదని, తమ వాళ్లే కాపాడారంటూ బాధితులు మీడియా ఎదుట వాపోయారు. అయితే, ఖమ్మం జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు ఉన్నా కూడా వరద బాధితులకు న్యాయం జరగలేదని, అలాంటప్పడు మీరు ఉంటే ఎంత లేకపోతే ఎంత? అని బీఆర్ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ విమర్శలు చేస్తున్నారు. ఆపదలో ఉన్నవారిని రక్షించడం, ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యత అని గుర్తుచేశారు. పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబును చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news