సర్టిఫికెట్లు అన్నీ కోల్పోయాం.. మంత్రి పొంగులేటికి బాధితుల మొర

-

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాన్ ఎఫెక్ట్‌తో ఏపీలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. విస్తారంగా వర్షాలు కురుస్తుడటంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక హైదరాబాద్‌లో ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతమవుతుండగా.. రోడ్ల మీద వరద నీరు పేరుకుని పోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.ఇక ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇంట్లోకి నీరు చేరడంతో వస్తువులు అన్నీ పాడైపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇంట్లోకి వరదనీరు చేరి సర్టిఫికెట్లు పాడైపోయాయని, తమను ఆదుకోవాలని మంత్రి పొంగులేటికి ఓ బాధితురాలు మొర పెట్టుకున్నది. గతంలోనూ ఇటువంటి విపత్తులు వచ్చిన సమయంలో ఉచితంగా సర్టిఫికెట్లను పొందేలా ప్రభుత్వాలు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా అదేవిధంగా అకాడమిక్ ధృవపత్రాలు కోల్పోయిన వారికి మళ్లీజారీ చేయాలని పలువురు బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news