వర్షాలతో ఇప్పటివరకు 16 మంది చనిపోయినట్టు రిపోర్టు వచ్చిందని ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబు. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రివ్యూ సమావేశం జరిగింది…వర్షాలకు నష్టపోయిన రైతులు జిల్లాలపై అధికారులతో రివ్యూ చేశామన్నారు. తెలంగాణలో 8 జిల్లాలకు తీవ్రమైన ప్రభావం పడిందని.. ఇరిగేషన్ అధికారులతో పోలీస్ శాఖతో జిహెచ్ఎంసి సిబ్బందితో సమావేశం నిర్వహించామన్నారు.
వర్షాలతో ప్రాణాలు కోల్పోయిన వారికి సహాయం చేయాలని నిర్ణయించామని తెలిపారు. నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటుంది..అత్యవసర పరిధిలో తప్ప బయటకి ఎవరు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులందరూ కూడా ఫీల్డ్ లో ఉండి పరిస్థితులను సమీక్షించాలి.. విద్యుత్తు, రహదారులు, రోడ్డు నిర్మాణాలను వెంటనే పునర్దించాలని కోరామని తెలిపారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు మంత్రి శ్రీధర్ బాబు.