ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా లేకపోవడం వల్ల అక్కడ… కృష్ణా జిల్లాలలో ఎక్కువ నష్టం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.పక్క రాష్ట్రం కంటే తెలంగాణ రాష్ట్రంలో నష్టం తక్కువగా జరిగిందని వెల్లడించారు. ఇక్కడ తమ ప్రభుత్వం అలెర్ట్ గా ఉన్న నేపథ్యంలోనే ఇది సాధ్యమైందని.. చంద్రబాబు ప్రభుత్వం పైన పరోక్షంగా విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
తమ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తున్న నేపథ్యంలో… డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి… ఏపీ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారని గులాబీ నేతలు చెబుతున్నారు. వాస్తవ విషయానికి వస్తే విజయవాడలో వరదలు వస్తే నిద్రపోకుండా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేసిన దృశ్యాలు మన కంటి ముందే కనిపిస్తాయి. బోట్లు వేసుకొని మరీ 70 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు చాలా కష్టపడ్డారు. కానీ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా సహాయం చేయలేదని ఇప్పటికీ ప్రజలు.. ఆగ్రహ ఆవేశాలకు లోను అవుతున్నారు.
https://x.com/TeluguScribe/status/1831167547418312836