రెండు తెలుగు రాష్ట్రాలకు రెబల్ స్టార్ ప్రభాస్ భారీ విరాళం..

-

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో పలు చోట్ల కాలువలకు గండ్లు పడ్డాయి. ఫలితంగా ఖమ్మంలోని మున్నేరువాగు, ఏపీలోని విజయవాడలో బుడమేరు వాగుల నుంచి పెద్ద ఎత్తున వరద రావడంతో పలు గ్రామాలు ముంపునకు గురయ్యాయి.ఫలితంగా రెండు రాష్ట్రాల్లో ప్రజలు చాలా మంది నిరాశ్రయులయ్యారు. కొందరు తమ జీవనోపాధిని కోల్పోయారు. ప్రభుత్వాలకు భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ క్రమంలోనే ఆర్థిక సాయం కోసం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునివ్వగా..సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.

తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు.ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ చెరో రూ.50లక్షలు, విశ్వక్ సేన్ చెరో రూ.5 లక్షలు అందించగా.. ప్రభాస్ ఏపీ, తెలంగాణ సీఎంఆర్ఎఫ్‌కు రూ.5 కోట్లు అనగా.. చెరో రూ.2.5కోట్లు భారీ విరాళం ప్రకటించారు. కేరళలో వరదల వచ్చిన సమయంలోనూ ప్రభాస్ రూ.2కోట్ల భారీ విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకే ప్రభాస్‌ను డార్లింగ్ అని అంటారని ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. కాగా, మెగాస్టార్ చిరు సైతం చెరో రూ.50లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news