“తమ్ముడూ ఇదొక్కటీ చెయ్ నాకోసం ..” NTRకి కల్యాణ్ రామ్ షాకింగ్ కోరిక

-

ఈ సంక్రాంతి బరిలో రెండు పెద్ద సినిమాలతో పాటు నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ ఎంటర్టైనర్ ‘ఎంత మంచి వాడవురా’ కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు చిత్రాల కన్నా కొంచెం లేటుగా కరెక్టు పండుగ రోజున విడుదల కానున్న ఈ చిత్రానికి ఒక పెద్ద అడ్డంకి ఉంది. నిజంగా చెప్పుకోవాలంటే మొన్న స్టేజి మీద మిగతా హీరోలు ఈ చిత్రం కూడా ఈ సంక్రాంతికి హిట్ సాధించాలి అని చెప్పే వరకు చాలామందికి కళ్యాణ్ రామ్ ఈ సంక్రాంతి బరిలో ఉన్నాడని తెలియదు. వాళ్ళ టీం చేస్తున్న ప్రమోషన్లు ఆ రేంజ్ లో ఉన్నాయి మరి.

 

అందుకే కళ్యాణ్ రామ్ తమ్ముడు ఎన్టీఆర్ ను ఒక సహాయం కోరినట్లు సినీ వర్గాల నుంచి టాక్ బయటకు వచ్చింది. ఎన్టీఆర్ ప్రమోషనల్ టీం తో తన చిత్రానికి విస్తృతంగా ప్రచారం చేయించమని సహాయం కోరినట్లు సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ ఆ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరవుతున్న సంగతి తెలిసిందే. దానికి తోడు ఎంతో అనుభవం ఉన్న అతని ప్రమోషనల్ టీమ్ కూడా ఈ చిత్రంపై వర్క్ చేస్తే తన చిత్రానికి మైలేజ్ బాగా వస్తుందని కళ్యాణ్ రామ్ ఆశ. దీనికి తారక్ కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

ఇకపోతే ‘శతమానం భవతి’ లాంటి నేషనల్ అవార్డు గ్రహీత అయిన డైరెక్టర్ సతీష్ వేగ్నేశ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

Read more RELATED
Recommended to you

Latest news