చంద్రబాబుకు తప్పిన పెను ప్రమాదం.. దూసుకు వచ్చిన ట్రైన్!

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 2024లో బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే ఏపీలో భారీ వర్షాలు కురవడంతో వరద బాధితులు నానా అవస్థలు పడ్డారు. కొంతమంది మూడు రోజులుగా జలదిగ్భందంలోనే గడిపారు. భోజనం కోసం పడరాని పాట్లు పడ్డారు. బోట్స్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో అయితే ఆహారం అందక అవస్థలు పడ్డారు. సీఎం చంద్రబాబు అయితే వరద బాధితుల కోసం సహాయం అందించేందుకు విజయవాడలోనే ఉన్నారు.

తాజాగా అమరావతి మధురానగర్ రైల్వే ట్రాక్‌పై సీఎం చంద్రబాబు వెళ్లారు. సీఎం రైల్వే ట్రాక్ పై ఉండగానే ట్రాక్ పైకి రైలు దూసుకొచ్చింది. రైలును చూసి వెంటనే సీఎం సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. బుడమేరు కింద నుంచి ప్రవహిస్తుండటంతో సరిగ్గా కనిపించడం లేదని రైల్వే ట్రాక్ ఎక్కారు సీఎం చంద్రబాబు. కార్యకర్తలు లైన్‌మెన్‌ను తీసుకువచ్చి ఎర్రజెండా ఊపడంతో ఆగింది ట్రైన్. సీఎం చంద్రబాబుకు 3 అడుగుల దూరంలో నిలిచింది రైలు.

Read more RELATED
Recommended to you

Latest news