రేషన్, ఆధార్ కార్డులు లేకున్నా ఫ్రీ రేషన్ : మంత్రి నాదెండ్ల

-

ఏపీలోని విజయవాడ ముంపు గ్రామాల బాధితులకు సహాయక చర్యలు శరవేగంగా సాగుతున్నాయి. ముందుగా వరద బాధితుల్లో కొందరికి ఆధార్, రేషన్ కార్డులు లేనివారికి కూడా సహాయక చర్యల కింద అన్ని విధాలుగా సాయం చేస్తున్నట్లు ఏపీ పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు వాగు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమైన విషయం తెలిసిందే. అయితే, కాలువకు పడిన గండ్లను అధికారులు, ఆర్మీ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే విజయవాడలోని వరద బాధితులకు నిత్యావసరాలు, పాలు, వాటర్ బాటిల్స్, యాపిల్స్, బిస్కట్ పాకెట్స్ను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. తొలిరోజు 15 వేల కుటుంబాలకు అందజేయగా, శనివారం మరో 40 వేల కుటుంబాలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్, రేషన్ కార్డులు లేని వారినుంచి మొబైల్ నంబర్, కుటుంబ వివరాలు సేకరించి ఉచితంగా సరుకులు అందజేయనున్నట్లు మంత్రి మనోహర్ వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news