షాకింగ్.. మనిషి కడుపులో 6 వేళ్ల రాళ్లను తొలగించిన వైద్యులు!

-

ఆధునిక జీవన విధానంలో మనిషి లేనిపోని కొత్త వ్యాధులను కొని తెచ్చుకుంటున్నాడు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, కాలుష్య కారకాలు పెరిగిపోవడం, తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఫిజికల్ ఎఫర్ట్ లేకుండా కూర్చుని ఎక్కువగా పనిచేయడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, నీరు శరీరానికి తగినంత తీసుకోకపోవడం, నిద్రలేని రాత్రులు గడపడం వంటివి మనిషి జీవనశైలిని దారుణంగా దెబ్బతిస్తున్నాయి. ఫలితంగా 60 ఏళ్లలో రావాల్సిన అనారోగ్య సమస్యలు కేవలం 25 ఏళ్ల నుంచే ప్రారంభం అవుతున్నాయి.

తాజాగా రాజస్తాన్‌లోని కోటాలో 70 ఏళ్ల వ్యక్తికి వైద్యులు ఓ అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. అతని పిత్తాశయం నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 6,110 రాళ్లను తొలగించారు. మూడు రోజుల కిందట అతను కడుపు నొస్తుందని సోనోగ్రఫీ చేయించుకోగా.. పిత్తాశయం మొత్తం రాళ్లతో నిండిపోయి ఉంది.12*4 సెంమీ పరిణామంతో రాళ్లు కనిపించాయి.దీంతో లాప్రోస్కోపిక్ సర్జరీ కష్టం కావడంతో ఎండో బ్యాగ్‌ని ఉపయోగించి పిత్తాశయం నుంచి రాళ్లు మొత్తం తొలగించినట్లు వైద్యులు తెలిపారు. సుమారు 30-40 నిమిషాల పాటు సర్జరీని పూర్తి రోగిని ఇంటికి పంపినట్లు తెలిపారు. అయితే, మనజీవనశైలి సరైన విధానంలో లేకపోవడం వల్లే కిడ్నీలు, పిత్తాశయంలో రాళ్లు పేరుకుపోతాయని డాక్టర్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news