చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి… ఏడాది అయిన తరుణంలో నారా లోకేష్ ట్వీట్ చేశారు. నిండు చంద్రుడు, ప్రజలు ఒక వైపు..నియంత జగన్ కుట్రలు మరో వైపు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. నిజాయితీకి నిలువెత్తు రూపమైన చంద్రబాబు గారి అక్రమ నిర్బంధంపై తెలుగు జాతి ఒక్కటై ఉద్యమించిందని తెలిపారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కోసం, తెలుగు ప్రజల కోసం పరితపించే చంద్రబాబు గారిని ఏడాది క్రితం తప్పుడు కేసులో అక్రమ అరెస్ట్ చేయడమే వైసీపీ సమాధికి జనం కట్టిన పునాది అయ్యిందని తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర…కూడా ఇదే అంశంపై మాట్లాడారు. చంద్రబాబుని అరెస్ట్ చేసి నేటికి ఏడాదని…చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేస్తే.. ప్రజలు కన్నీళ్లు పెట్టారన్నారు. ఇప్పుడు ప్రజల కనీళ్లు చూడకూడదని చంద్రబాబు కష్టపడుతున్నారని… నాడు ప్రజల తరపున పోరాడుతూ బస్సులో ఉన్నారు.. ఇప్పుడు ప్రజల కన్నీళ్లు తుడవడానికి బస్సులోనే ఉన్నారని తెలిపారు.