రన్ వే పై అదుపు తప్పిన విమానం.. ప్రయాణికులకు గాయాలు

-

ఇండోనేషియాలోని పపువా రీజియన్ యాపిన్ ద్వీపంలో 48 మందితో టేకాఫ్ అవుతున్న ఏటీఆర్ 42 విమానానికి పెను ప్రమాదం తప్పింది. రన్ వే పై అదుపు తప్పి సమీపంలోని చెట్లలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. త్రిగన ఎయిర్ కు చెందిన ఈ విమానం సోమవారం ఉదయం జయపురకు ప్రయాణం మొదలు పెట్టగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

విమాన ప్రమాదం జరిగిన సమయంలో ఓ పాపతో సహా మొత్తం 42 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది అందులో ఉన్నారు. గాయపడిన ప్రయాణికులను ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు. ఇక ఆసియాలోనే అత్యంత చెత్త విమానయాన సంస్త రికార్డును ఇండోనేషియా మూఠగట్టుకుంది.  ముఖ్యంగా అక్కడి ప్రభుత్వాల నిర్లక్ష్యానికి ప్రకృతి విపత్తులు తోడు కావడంతో ప్రతీ ఏటా ఏదో ఒక ప్రమాదం చోటు చేసుకోవడం.. పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం సర్వసాధారణంగా మారిపోయింది. 1945 నుంచి ఇప్పటివరకు దాదాపు 100 ప్రమాదాలు జరగ్గా.. 1300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు ఏవియేషన్ సేప్టీ నెట్ వర్క్ డేటా వెల్లడించడం గమనార్హం. 

Read more RELATED
Recommended to you

Latest news