ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవడంతో విజయవాడ నగరమంతా ఒక్కసారిగా అతలకుతలమైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇప్పటికే పలు ప్రాంతాలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు కనీస అవసరాలు తీర్చాలని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ అధికారులు మాత్రం మాకు అవసరమైన వాటర్, ఫుడ్ అందించడంలో విఫలం చెందారని ప్రజలు పేర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఓ వీఆర్ఓ వరద బాధితుడి పై చేయి చేసుకుంది. అన్ని అవసరాలు తీర్చే అధికారులు ఇలా ఎలా చేయి చేసుకుంటారని ఆ బాధితుడు మీడియా ముందు వాపోయాడు. ప్రజలకు తోడుగా నిలవాల్సిన వీఆర్ఓ వరద బాధితుడిపై దాడి చేయడం దారుణమని పలువురు పేర్కొంటున్నారు. తమకు సకాలంలో ఆహారం, మంచి నీళ్లు, కనీస సౌకర్యాలు అందడం లేదని వాపోయాడు. వీటి గురించి వీఆర్ఓను ప్రశ్నిస్తే.. చేయి చేసుకుందని వెల్లడించారు బాధితుడు. స్థానికులు వీఆర్ఓ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.