గుడ్ న్యూస్‌: భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. వెండి కూడా

-

రెండు రోజులుగా భ‌రీ పెరుగుద‌ల న‌మోదు చేసిన బంగారం ధ‌ర‌కు ఈ రోజు బ్రేకులు ప‌డ్డాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర భారీగానే పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఏకంగా రూ.530 దిగొచ్చింది. దీంతో పసిడి ధర రూ.38,430కు క్షీణించింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.530 తగ్గుదలతో రూ.41,980కు పడిపోయింది. బంగారం ధర పడిపోతే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.250 పడిపోయింది. దీంతో ధర రూ.50,750కు క్షీణించింది.

ఢిల్లీ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.550 పడిపోయింది. దీంతో ధర రూ.39,250కు దిగొచ్చింది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గింది. దీంతో ధర రూ.40,440కు క్షీణించింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.250 తగ్గింది. దీంతో ధర రూ.50,750కు దిగొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news