తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం గుర్తులను విడుదల చేసింది. గుర్తింపు పొందిన జాతీయ పార్టీలుగా ఉన్న బిజెపి, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ప్రాంతీయ పార్టీలుగా ఉన్న అధికార తెరాస, తెలుగుదేశం, మజ్లీస్ లకు పాత గుర్తులను కేటాయించిన ఎన్నికల సంఘం, స్వతంత్ర అభ్యర్ధుల కోసం మాత్రం 50 గుర్తులను అధికారికంగా ప్రకటించింది.
ఒకసారి ఆ గుర్తులు ఏంటి అనేది చూస్తే… ప్యాంట్, సాక్స్, కోటు, స్టెతస్కోప్, మూకుడు, బెండకాయ, టైర్లు, పిల్లనగ్రోవి, ఏసీ, ఆపిల్, గాజులు, బ్యాట్, బ్యాటరీ టార్చ్, బైన్యాక్యులర్స్, గ్యాస్ సిలిండర్, గ్యాస్ స్టవ్, గాజు గ్లాస్, హెడ్ ఫోన్, హాకీ కర్ర బంతి, పోస్టుడబ్బా, కప్పు సాసరు, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, కవరు, పుట్‌బాల్, గౌను, గరాటా, స్టూల్, టేబుల్, టెలిఫోను, టూత్ బ్రష్,high
రిప్రిజిరేటర్, ఉంగరం, కత్తెర, సితార్, సాక్స్, సోపా, స్పానర్, అగ్గిపెట్టె, పెన్‌డ్రైవ్, పైనాఫిల్, కుండ, ప్రెషర్ కుక్కర్. అయితే గుర్తును పోలి ఉన్న గుర్తులు లేకుండా చూడాలని పలు పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కాగా మున్సిపల్ ఎన్నికలకు మంగళవారం హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమీషన్ నిభందనలు పాటించలేదు అంటూ దాఖలు అయిన పిటీషన్ ని ఎన్నికల సంఘం కొట్టేసింది.