ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్ నెలకొంది. హుటా హుటిన ఢిల్లీకి కల్వకుంట్ల కవిత వెళుతున్నారు. ఇవాళ ఢిల్లీ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత వెళతారు. లిక్కర్ సిబిఐ కేసు చార్జ్ పై ఇవాళ ట్రయల్ కోర్టులో విచారణ జరుగనుంది. ఈ తరుణంలోనే… ట్రయల్ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత, ఇతర లిక్కర్ కేస్ నిందితులు హాజరు కానున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగానే… ఎమ్మెల్సీ కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు ట్రయల్ కోర్ట్ విచారణకు వర్చువల్ గా హాజరుకానున్నారు. సిబిఐ దాఖలు చేసిన చార్జి షీట్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఫెర్ గా లేవని , కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీ గా ఉన్న డాక్యుమెంట్స్ డిఫెన్స్ లాయర్లకు ఇవ్వాలని గత విచారణ సందర్భంగా కోరారు నిందితుల తరపు న్యాయవాదులు. ఇక సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ ను సప్లై చేయాలని ఆదేశించారు జడ్జ్. కాగా ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితకు బెయిల్ వచ్చింది.