పెద్దపల్లి జిల్లా మంథని లో సెంటిలియన్ సాఫ్ట్ వేర్ కంపనీ ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… మంథని ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తున్న సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రతిభ ఉంటుందని వివరించారు.
చదువుకున్న పిల్లలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేది మా సంకల్పమన్నారు. మా మంథని ప్రాంత మేధస్సుకు ప్రపంచ వ్యాప్తంగా పేరుందని తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. మంథని లో త్వరలో స్కిల్ సెంటర్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.