ఎల్‌ఐసీ నుంచి నెలకు 10 వేలు… ఎలా వస్తాయంటే..

-

డబ్బు సంపాదించడమే కాదు సరైన మార్గంలో ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ మొత్తం ఏ ఇబ్బంది లేకుండా జీవించొచ్చు. ప్రత్యేకంగా సేవింగ్స్ ప్లాన్స్ అందుకోసం అందుబాటులో ఉన్నాయి. వాటిలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. జీవితంలో కష్టపడి సంపాదించలేని సమయం వృద్ధాప్యం. ఆ సమయంలో డబ్బులు వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. రిటైర్మెంట్ ప్లానింగ్ కి సపోర్ట్ చేసే పథకాలు చాలా ఉన్నాయి. స్టాక్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, నేషనల్ పెన్షన్ సిస్టం, ఫిక్స్డ్ డిపాజిట్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా అనేక వాటిని అందిస్తోంది. నెలకు 10,000 పైన పెన్షన్ ఉండడం సురక్షితం అని భావించినట్లయితే బెస్ట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి ఎల్ఐసి న్యూ జీవన్ శాంత్ ప్లాన్ నెంబర్ 858 ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా రాబడి వస్తుంది. ఎలా పొందాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

అవసరాల ఆధారంగా ఇయర్లీ, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ, మంత్లీ పేమెంట్ చేయొచ్చు. డెత్ బెనిఫిట్ కూడా ఉంది. 30 నుంచి 79 ఏళ్ల మధ్య వారు ఈ పథకానికి అర్హులు మినిమం లక్షన్నర ఇందులో పెట్టాలి. 30 ఏళ్ల వయసులో ఈ ప్లాన్ ని కొనుగోలు చేసినట్లయితే 12 ఏళ్ల పాటు చెల్లింపుని వాయిదా వేస్తే వార్షిక పెన్షన్ 132920 వస్తుంది. నెలకు పదివేలకు పైగా ఇలా మీరు పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news