విజయవాడ అమ్మవారి సొమ్ములు టీడీపీ నేతలు పదికొక్కుల్లా తింటున్నారు – పోతిన మహేష్

-

విజయవాడ అమ్మవారి సొమ్ములు టీడీపీ నేతలు పదికొక్కుల్లా తింటున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైస్సార్సీపీ నాయకుడు పోతిన మహేష్. అమ్మవారి ఆలయంలో టిడిపి పందికొక్కులు చేరి 3 నెలల్లో 4 కోట్ల రూపాయలు అమ్మ సొమ్ము కొట్టేశారని.. దీనికి ప్రధాన సూత్రదారి మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు.

pothina mahesh on budda venkanna

పార్కింగ్ కాంట్రాక్టర్ అమ్మవారి ఆలయానికి డబ్బులు చెల్లించకుండా 3 కోట్ల రూపాయలు మరియు కనకదుర్గ నగర్ లోని 24 షాపులు కు 40 శాతం అద్దె తగ్గించి ఎటువంటి టెండర్ పిలవకుండా 3 సంవత్సరాల పాటు 24 షాపులు కొనసాగించుకునేందుకు మరొక కోటి రూపాయలు 4 కోట్ల రూపాయలు కొట్టేసారని ఆరోపణలు చేశారు.

అమ్మవారి ఆలయంలో అధికారులను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ ఇది మా టిడిపి జనసేన బిజెపి ప్రభుత్వం అని మేము చెప్పిందని… చేయాల్సిందేనని బుద్ధ వెంకన్న అమ్మవారి ఆలయంలోనే కాదన్నారు. ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం వారికి కూడా హుకుం జారీ చేస్తున్నారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news