ఉత్కంఠగా ‘సుబ్రహ్మణ్య’ ఫస్ట్ అడ్వెంచర్ గ్లింప్స్..!

-

ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టీస్ట్ పి.రవిశంకర్ కుమారుడు అధ్వయ్ హీరోగా పరిచయం అవుతున్న మూవీ ఉత్కంఠ. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఎస్.జీమూవీ క్రియేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 2 గా నిర్మిస్తున్నారు. సోషియో పాంటసీ అడ్వెంచర్ జోనర్ లో ఈ మూవీ ప్రొడక్షన్ హైస్ కి మొదటి చిత్రంగా నిలిచింది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన అడ్వెంచర్ గ్లింప్స్ విడుదల చేశారు.

ఈ గ్లింప్స్ చాలా ఉత్కంఠగా ఉన్నాయి. ఇవి చూస్తుంటే.. సినిమాని తప్పక చూడాలనే ఫీలింగ్ కలుగుతోంది. ఒక పాడుపడిన బావిలోకి వెళ్తాడు అద్వయ్. అందులో ఉన్న గ్రంథాన్ని తీసుకుంటుండగా.. చాలా సర్పాలు వెంటపడుతాయి. వాటి నుంచి తప్పించుకొని ఆ గుడిలోకి వెళ్లాలనుకుంటాడు. ఆ గుడి వేరే కొండ పై ఉంటుంది. అందులోకి వెళ్లేందుకు దారి ఉండదు. దీంతో ఆ విష సర్పాలు అద్వయ్ ను చుట్టుముడుతాయి. గుడి వెనుక బ్యాక్ గ్రౌండ్ లో పెద్దగా రాముడి అవతారం కనిపిస్తోంది. ఆ గ్రంథంలో దాగి ఉన్న రహస్యం ఏంటి అనేది చాలా ఉత్కంఠగా మారింది. సుబ్రహ్మణ్య మూవీ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, హిందీ వంటి భాషల్లో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news