కులగణనతో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు పదవులు వస్తాయని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ.హన్మంత్ రావు పేర్కొన్నారు. తాజాగా ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. బలహీన వర్గాల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలని కోరారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే దేశంలోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూల్చుతామని కొందరూ బీఆర్ఎస్ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అలాంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఇప్పుడే మానుకోవాలని వీహెచ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.
అధికారం కోల్పోయే సరికి బీఆర్ఎస్ నేతల్లో ఎవ్వరికీ మైండ్ చేయడం లేదని సీరియస్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీ ఏదైనా ఉంటే ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలన్నారు. కానీ అందుకు విరుద్ధంగా బీఆర్ఎస్ తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తరిమేసిన ఆ పార్టీ నేతలకు బుద్ది రాలేదని మండిపడ్డారు వీ.హెచ్.