హైడ్రా చర్యలు.. కూల్చివేతలు పరిష్కారం కాదన్న కేసీఆర్!

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలపై మాజీ సీఎం కేసీఆర్ తొలిసారిగా స్పందించినట్లు తెలుస్తోంది. చెరువు భూములు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని భూముల్లో అక్రమ నిర్మాణాలకు కూల్చివేతలే పరిష్కారం కాదని పేర్కొనట్లు సమాచారం.ఎంఎస్ మక్తా వంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని, అలాంటి వాటిని ఎలా తొలగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పాటు కంటే ముందే లక్షల ఎన్‌క్రోచ్ మెంట్లు ఉన్నాయని, కూల్చివేతలకు బదులుగా కొత్త వాటికి అనుమతులు ఆపడంపై దృష్టి సారించాలని కేసీఆర్ హితవు పలికినట్లు సమాచారం.

ఇదిలాఉండగా, నగరంలో హైడ్రా పరిమితిని పెంచడంతో పాటు దానికి విసృత అధికారాలు ఇవ్వడంపై రేవంత్ సర్కార్ సమాలోచనలు చేస్తుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన ప్రక్రియ సైతం పూర్తయినట్లు సమాచారం. ఓఆర్ఆర్ పరిధిలోని బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పరిధిలో ఇప్పటికే జనాలు ఉంటున్న ఇళ్లను వదిలి నిర్మాణంలో ఉన్నవాటిని తప్పక కూలుస్తామని కమిషనర్ రంగనాధ్ స్పష్టంచేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news