ఏజీ ఆఫీస్ వద్ద నిలిచిపోయిన ఖైరతాబాద్ గణేషుడు..!

-

దేశంలోనే అత్యంత ఎత్తయిన వినాయకుడిగా ఖైరతాబాద్ మహా గణేషుడు పేర్గాంచాడు. దాదాపు 10 రోజుల పాటు లక్షలాది సంఖ్యలో భక్తులకు దర్శనమిచ్చాడు సప్తముఖ మహా గణపతి. ఇవాళ తెల్లవారుజామున బయలుదేరాడు. ప్రస్తుతం శోభయాత్ర కొనసాగుతోంది. మరో అరగంట సమయంలో క్రెయిన్ నెంబర్ 4 వద్దకు చేరుకోనుంది. ఈ వినాయకుడి కోసం 700 మంది పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

అయితే ఖైరతాబాద్ నుంచి ప్రధాన దారిలో వేగంగా ముందుకు సాగడంతో భక్తులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా భాగ్యనగర్ ఉత్సవ సమితి సభ్యులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో దాదాపు 35 నిమిషాల పాటు నిలిపివేశారు. ఆ తరువాత కొద్ది సేపటికి పోలీసులు వారికి నచ్చజెప్పడంతో  ముందుకు కదిలింది. శోభ యాత్ర సమయంలో భక్తుల కోలాటాలు, డీజే సౌండ్లతో ఆ ప్రాంతం మొత్తం కోలాహాలంగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. నిమజ్జనం చేసే ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. వేలాది సంఖ్యలో భక్తులు ఖైరతాబాద్ గణేషుడిని నిమజ్జనం చేసే క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news