తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రదానంగా యూనివర్సిటీ యొక్క విధి, విధానాలు, పరిశ్రమలతో అనుసంధానం చేయడం తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డ్ మీటింగులో నారా బ్రాహ్మణి పాల్గొనడంతో అందరూ ఆశ్యర్యానికి గురవుతున్నారు.
స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పన, వారికి సంబంధించిన అవగాహన, ఏయే కోర్సులు తదితర వాటిపై శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, వర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, వర్సిటీ కో చైర్మన్ శ్రీనివాస్ రాజు,సీఎస్ శాంతి కుమారి, పలు రంగాల పారిశ్రామిక వేత్తలు సమావేశానికి హాజరయ్యారు.