నేటి నుంచి ఐఫోన్ 16ప్రో అమ్మకాలు.. భారీగా ఎగబడుతున్న జనాలు!

-

ఐఫోన్ 16 ప్రో మోడళ్ల అమ్మకాలు ఇండియాలో నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త మోడల్ కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆపిల్ అభిమానులకు నిజంగానే శుభవార్త అని చెప్పవచ్చు.సేల్స్ ప్రారంభం కానున్నాయని తెలియడంతో ఉదయం నుంచే జనాలు ఐఫోన్ స్టోర్ల వద్ద పెద్దఎత్తున బారులు తీరారు. లైన్లలో నిలబడి మరీ ఎగబడి ఐఫోన్లు కొంటున్నారు.అయితే, భారత్‌లో తయారయ్యే ఐఫోన్‌ ప్రో సిరీస్‌ మోడళ్లను త్వరలో విక్రయించనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

అయితే, ఇటీవల బడ్జెట్‌లో దిగుమతి సుంకం తగ్గింపు వలన ముందు వెర్షన్‌ల కంటే తక్కువ ధరకు ఐఫోన్‌ ప్రో సిరీస్‌ను కంపెనీ విక్రయించనున్నట్లు పేర్కొంది. ఐఫోన్‌ 16 ప్రారంభ ధర రూ.79,900 ఉండగా.. ఐఫోన్‌ 16 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఇక ఐఫోన్‌ 16 ప్రో ప్రారంభ ధర రూ.1,19,000గా, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌ ప్రారంభ ధర రూ.1,44,900గా ఉంది. ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్‌లు 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1టీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో అందుబాటులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news