అశోక్ చవాన్, యడ్యూరప్ప లాగే రేవంత్ పదవి పోవడం పక్కా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్. సింగరేణి అంశంపై కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయటానికి సిద్ధంగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి పదవి ఊడబీకటానికి మంత్రి పొంగులేటి ప్రయత్నిస్తున్నాడని ఆరోపణలు చేశారు.
మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప ఉద్యోగాలు పోయినట్లే రేవంత్ ఉద్యోగం కోల్పోతున్నాడని చురకలు అంటించారు. బావమరిదికి అక్రమంగా టెండర్లు కట్టబెట్టిన వ్యవహారం రేవంత్ మెడకు చుట్టుకుంటుందని.. భార్య సోదరుడు బావమరిది కాకుండా ఏమవుతారు? అని ప్రశ్నించారు. ఫోర్త్ సిటీ కాదు.. ముచ్చర్ల ఫోర్ బ్రదర్స్ సిటీ అంటూ ఘాటు విమర్శలు చేశారు. పదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన మాకు ఎలక్కడ అవినీతి జరుగుతుందో తెలియదా? అని ఆగ్రహించారు కేటీఆర్. మంత్రి పొంగులేటి కి కేటీఆర్ సవాల్ విసిరారు. అమృత్ టెండర్ లలో తప్పు జరిగిందని.. నేను ఖచ్చితంగా నిరూపిస్తానని తెలిపారు.