పవన్‌ కాదు.. అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు దీక్ష చేయాలి – అంబటి

-

పవన్‌ కాదు.. అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు దీక్ష చేయాలని సెటైర్లు పేల్చారు అంబటి రాంబాబు. పవన్ ఎందుకు దీక్ష చేస్తున్నాడో అర్థం కావట్లేదని..దీక్షలను కూడా రాజకీయాల కోసం వాడుతున్నారని ఆగ్రహించారు. భగవంతుడుని అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయటానికి చంద్రబాబు సిద్దమేనని పేర్కొన్నారు. జగన్ అధికారంలో లేనపుడు లడ్డూ కల్తీ జరిగితే జగన్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు.

ambati rambabu on tirumala laddu issue

చంద్రబాబు, పవన్, పురంధరేశ్వరీ మూకుమ్మడి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అందరూ కలిసి ఆరోపణలు చేసినంత మాత్రాన అవాస్తవాలు వాస్తవాలు గా మారవు… అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు దీక్ష చేయాలని ఆగ్రహించారు. టీటీడీ లడ్డూ ప్రసాదం మీద ఆరోపణల ద్వారా రాజకీయ. ప్రయోజనం పొందే ప్రయత్నం చేస్తున్నారని.. ఆధారాలు లేకుండా చంద్రబాబు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఆరోపణలు చేస్తు న్నారని ఫైర్‌ అయ్యారు. దాడులు చేయటం ద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news