తిరుమలలో రేపు ఉదయం శాంతిహోమం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా ఆయన ఉండవల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమలను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. టెంపుల్ పవిత్రతను కాపాడటం మా బాధ్యత అన్నారు. 3 రోజుల పాటు పవిత్ర యాగం చేస్తాం. రేపు ఉదయం 6 గంటల నుంచి 10గంటల వరకు శాంతిహోమం, పంచద్రవ్య సంప్రోక్షణ నిర్వహిస్తాం. విమాన ప్రకారం దగ్గర యాగశాలలో శాంతి యాగం నిర్వహించనున్నట్టు తెలిపారు సీఎం చంద్రబాబు.
యాగం కోసం మూడు హోమ గుండాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. యాగంలో 8 మంది అర్చకులు, ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొంటారు. ఆగమ శాస్త్రం తెలిసిన వారితో కమిటీ వేస్తామని తెలిపారు. ఐజీ స్థాయి అధికారితో సిట్ వేస్తాం అని తెలిపారు. అన్ని దేవాలయాల్లో ఎప్పటికప్పుడు యాగాలు చేస్తారు. నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు రిపోర్టులో తేలింది. తిరుమల పవిత్రను ఎవ్వరూ మలినం చేయలేరని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సిట్ నివేదిక ఆధారంగా సీరియస్ యాక్షన్ తీసుకుంటామని తెలిపారు చంద్రబాబు.