దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఎన్టీఆర్ సంచలన ప్రకటన !

-

దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే.. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై ఎన్టీఆర్ స్పందించారు. ఈ మేరకు వీడియో రిలీజ్ చేసిన జూ.ఎన్టీఆర్..కీలక ప్రకటన చేశారు. ఆదివారం రోజున దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవడం చాలా బాధాకరమని పేర్కొన్నారు జూనియర్‌ ఎన్టీఆర్‌. సమయం దొరికినప్పుడు మీతో దేవర మూవీ కోసం పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దాం అని ఎగ్జైటెడ్ గా వున్నానని తెలిపారు.

Tarak Fans Disappointed After Devara Event Cancelled Due to Huge Turnout of People

సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈవెంట్ ను క్యాన్సిల్ చేయడం జరిగిందన్నారు జూ.ఎన్టీఆర్..కీలక ప్రకటన చేశారు. అభిమానుల కంటే నేను ఎక్కువ బాధపడుతున్నానని చెప్పారు. ఈవెంట్ క్యాన్సిల్ అవడం నిర్మాతలో లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ ని బ్లేమ్ చేయడం తప్పు అని నా ఫీలింగ్ అని తెలిపారు. అభిమానులు కురిపించే ఈ ప్రేమకు ఆ జన్మాంతం రుణపడి ఉంటానన్నారు జూ.ఎన్టీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news