తెలంగాణ ప్రజలకు శుభవార్త..త్వరలోనే అందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు

-

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. తెలంగాణ రాష్ట్రంలో ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ప్రతీ నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాన్ని ఎంచుకుని పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని సూచించిన సీఎం రేవంత్‌ రెడ్డి…. పైలట్ ప్రాజెక్టుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రేషన్, హెల్త్ ప్రొఫైల్ తో పాటు సంక్షేమ పథకాలన్నిటికీ ఇక ఒకే కార్డు ఉండనుంది.

TG Govt Digital Health Card

వన్ స్టేట్… వన్ డిజిటల్ కార్డ్ విధానంతో ముందుకెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో ఎక్కడైనా సంక్షేమ పథకాలను పొందేలా చర్యలు తీసుకోనుంది. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతోనే కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్య సేవలు అందించనునంది. అందులో ప్రతీ ఒక్కరి హెల్త్ పొఫైల్ ఉండాలన్న సీఎం రేవంత్‌…అర్హులందరికీ ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల మానిటరింగ్ కు జిల్లాలవారీగా ఒక వ్యవస్థ ఉండాలని సూచించిన సీఎం రేవంత్‌.. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక లాంటి ఇతర రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news