కిన్నెర మొగులయ్యను సన్మానించిన ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ

-

పద్మశ్రీ అవార్డు గ్రహీత 12 మెట్ల కిన్నెర మొగులయ్యను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ, ఆయన సతీమణి సీబీఎం ట్రస్ట్ చైర్మన్ మాజీ జెడ్పీటీసీ డాక్టర్ అనురాధ దంపతులు హైదరాబాద్‌లోని వారి నివాసంలో సన్మానించారు.అనంతరం కొత్త వస్త్రాలతో పాటు కొంత ఆర్థిక సహాయం అందజేశారు. మొగులయ్యకు గత ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేసినా కొన్ని అనివార్య కారణాలతో అది ఆగిపోయింది.

అయితే, గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కేటాయింపు విషయంలో నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ ఇంటి స్థలం కేటాయించలేదని ఎమ్మెల్యే దృష్టికి మొగులయ్య తీసుకెళ్లారు.దీంతో పెన్షన్ పునరుద్ధరణతో పాటు ఇంటి స్థలం కేటాయిస్తానని, అలాగే తన వంతు సహకారం ఉంటుందని పద్మశ్రీ అవార్డు గ్రహీతకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ఈ విషయపై సెక్రటేరియట్‌కు వెళ్లి పెన్షన్ ఆగిపోవడానికి గల కారణాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు, తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news