పారాలింపిక్ లో 400 మీటర్ల రేస్ లో కాంస్య పతకం గెలిచిన దీప్తి జీవన్ కు కోటి రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని మరియు ఆమె కోచ్ నాగపురి రమేష్ కు పది లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని అందజేసింది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చెక్కులు ఇచ్చారు.
అయితే నిబంధనలను సడలించి ఈ నగదు ప్రోత్సాహకాన్ని ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే రాష్ట్రానికి కీర్తి తెచ్చే క్రీడాకారులకు గతంలో లేనటువంటి ప్రోత్సాహకాలు అందజేస్తాం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి. క్రీడారంగంలో సమూల మార్పులు జరుగుతున్నాయి. గ్రామీణ క్రీడా రంగానికి పెద్దపీట వేస్తూ, మట్టిలో మాణిక్యాల లాంటి క్రీడాకారులను గుర్తించి ప్రోత్సహిస్తాము అని శివసేన రెడ్డి పేర్కొన్నారు.