భారీ వర్షాలు, వరద బాధితులకు అందించే సాయంపై ఎన్యూమరేషన్ పూర్తయింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 లక్షల మందికి ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనుంది ప్రభుత్వం. విజయవాడ పరిధిలోనే ముంపు బారిన పడిన సుమారు లక్షన్నర మంది బాధితులు ఉన్నారు. బాధితులకు సాయం కింద అందించే ఆర్థిక సాయం కింద సుమారు రూ. 600 కోట్లను పంపిణి చేయనుంది ప్రభుత్వం. ఇళ్లు, దుకాణాలు, తోపుడు బళ్లు, వ్యాపారాలు, చిన్న తరహ పరిశ్రమలు, వాహానాలు, పంటలు, పశువులకు ఆర్థిక సాయం అందించనుంది కూటమి సర్కార్.
అయితే డీబీటీ కింద బాధితుల బ్యాంక్ ఖాతాలకు నేరుగా ఆర్థిక ప్యాకేజీ ఇవ్వనున్న ప్రభుత్వం.. ఎన్డీఆర్ఎఫ్ గైడ్ లైన్సుకు కంటే మించిన స్థాయిలో సాయం అందిస్తుంది. ముంపు ప్రాంతాల్లో 180 కోట్ల మేర బ్యాంక్ రుణాలు రీ-షెడ్యూల్ చేయనున్నారు. ఎన్యూమరేషనులో ఎవరైనా మిస్ అయితే నిబంధనల ప్రకారం వారికీ ఆర్థిక ప్యాకేజీ అందివ్వాలని ఆదేశించిన సీఎం చంద్రబాబు… రేపు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో వరద బాధితులకు సాయం అందించనున్నారు.