బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే రాజీనామా : ఆర్. కృష్ణయ్య

-

బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య నిన్న రాజ్యసభ పదవీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి విద్యానగర్ లోని ఆర్.కృష్ణయ్య నివాసంలో భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే ఆర్. ష్ణయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా బీసీలకు రాజ్యాధికారం వస్తే.. అందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. 

బీసీ ఉద్యమం ద్వారా..  దేశంలో ఎక్కడ లేనన్నీ విధంగా తెలంగాణ, ఏపీలో గురుకుల హాస్టల్స్  ఉన్నాయని తెలిపారు. ఉద్యమాల ద్వారానే ఇవి సాధించుకున్నామని తెలిపారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసమే రాజీనామా చేశానని తెలిపారు. జగన్ నా కమిట్ మెంట్ గుర్తించి రాజ్యసభ అవకాశం ఇచ్చారు.  పార్టీలకతీతంగా ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించుకొని రాజీనామా చేశాను. మా ఉద్యమం బలోపేతం చేయడానికి అందరూ సహకరించాలి. బీసీల రిజర్వేషన్ ద్వారా ఎంపీలు, ఎమ్మెల్యేలు,సర్పంచ్, ఎంపీటీసీలు ఇలా అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news