Bhatti Vikramarka: అమెరికా పర్యటనలో భట్టి విక్రమార్క..ఫోటోలు వైరల్‌

-

Deputy CM Bhatti Vikramarka on US visit: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. అమెరికా పర్యటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో నెవాడా, ఆరిజోనా పర్యటనలో భాగంగా హూవర్ డ్యామ్ ను సందర్శించారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు.

Deputy CM Bhatti Vikramarka on US visit

లాస్ వెగాస్ లో మైనింగ్ ఎగ్జిబిషన్ లోని ఆధునిక యంత్ర పరికరాలను పరిశీలన చేశారు. సంబంధిత కంపెనీ ప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు చర్చలు కూడా చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. మరో వారం రోజుల పాటు విదేశీ పర్యటన లోనే తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఉంటారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news