తెలంగాణ తెగువకు చిరునామా వీరవనిత చాకలి ఐలమ్మ : కేంద్ర మంత్రి బండి సంజయ్

-

తెలంగాణ తెగువకు చిరునామా వీరవనిత చాకలి ఐలమ్మ  అని  కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని బండి సంజయ్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, జ్వలించిన నిప్పు కనిక ఐలమ్మ అని బండి సంజయ్ పేర్కొన్నారు.

తొలి భూ పోరాటానికి నాంధి పలికిన వీరమాత.. తెలంగాణ తెగువకు చిరునామాగా నిలిచిన వీర వనిత అన్నారు. మహిళా లోకానికి స్ఫూర్తి ప్రదాత.. సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. గడీలపై గళమెత్తి భూ పోరాటానికి నాంధి పలికిన ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి మహిళా చైతన్యానికి ప్రతీక అని బండి సంజయ్  వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news