కల్తీ నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి వెనక్కి పంపారు : జగన్

-

కల్తీ నెయ్యి ట్యాంకర్లను రిజెక్ట్ చేసి వెనక్కి పంపారని మాజీ సీఎం జగన్ వెల్లడించారు. తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు. వాస్తవానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ 12 నుంచి నెయ్యిని సరఫరా చేయడం ప్రారంభించారు. జంతువుల కొవ్వును వాడారని.. అన్నీ తెలిసిన వ్యక్తి అబద్దాలు ఆడటం దారుణం అన్నారు. నెయ్యిని వాడలేదని తెలుస్తున్నా.. చంద్రబాబు రెండు నెలల తరువాత ఎందుకు అన్నాడు. జులై 06, 12 తేదీలలో వచ్చిన రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేయడం జరిగిందని ఈవో చెప్పారు.

అయితే సెప్టెంబర్ 19న టీడీపీ కార్యాలయం నుంచి NDDB ఎలా  రిలీజ్ చేస్తారు అని ప్రశ్నించారు.  ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని వాడలేదని..  వెనక్కి పంపించామని చెప్పడంతో పాటు  సెప్టెంబర్ 22న ఈవో తాను సంతకం చేసి ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చాడు. రిపోర్టు ఇచ్చిన తరువాత కూడా చంద్రబాబు ట్యాంకర్లు వచ్చేశాయి.. దానిని వాడేశారు. కేవలం రాజకీయంగా లబ్ది పొందేందుకు ఈ మాదిరిగా స్వామి ప్రసాదం విశిష్టతను, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను, ప్రసాదానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతలను తగ్గించడం అపవిత్రత కాదా అని  ప్రశ్నించారు. జరగనిది జరిగినట్టుగా అబద్దాన్ని ప్రచారం చేయడం ధర్మమేనా..? అని అడిగారు జగన్. 

Read more RELATED
Recommended to you

Latest news