నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు.. జానీ మాస్టర్ భార్య అయేషా

-

టాలీవుడ్ కి చెందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ లేడీ కొరియో గ్రాఫర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. నాలుగు రోజుల కస్టడీకి నార్సింగి పోలీసులు విచారణ చేపట్టేందుకు తీసుకున్నారు.

నార్సింగీ పోలీస్ స్టేషన్ లో భర్త జానీ మాస్టర్ ను  భార్య కలిశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. నా భర్త ను ఇలాంటి పరిస్థితుల్లో చూస్తాను అనుకోలేదు. నా భర్త ఎలాంటి తప్పు చేయలేదు. జానీ కోసం లంచ్ బాక్స్ తీసుకొచ్చాను. తనకు ఇష్టమైన చికెన్, రసం తెచ్చాను. యువతి నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది. కస్టడీ లో పోలీసులకు అన్ని విషయాలు చెప్పాడు. న్యాయంగా పోరాడతాం. కొన్నేళ్ల పాటు మా కుటుంబంలో ఒకరిగా ఉన్న యువతి ఇప్పుడు కేసులు పెడుతోంది అంటే ఇదంతా కుట్రపూరితమే అన్నారు. ఓ పెద్ద హీరో వెనక ఉండి నడిపిస్తున్నాడు అనేది అవాస్తవం. సోషల్ మీడియా సృష్టి అదంతా.. ఇండస్ట్రీ లో పెద్దలు కూడా మాకు అండగా ఉంటున్నారు. జానీ ఎలాంటి తప్పు చేయడని వాళ్లకు కూడా తెలుసు. బయటి ఫుడ్ పడక.. జానీ కొంత అస్వస్థతకు లోనయ్యాడు. ఇప్పుడు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news