3 రోజుల పాటు తిరుమలలోనే పవన్ కళ్యాణ్ ఉండనున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రకటన చేశారు. ప్రాయశ్చిత్తం దీక్ష విరమణకు విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తారన్నారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అక్టోబర్ 1 వ తేదీ సాయంత్రం 3గంటలకు రేణిగుంట విమానాశ్రయం కు పవన్ కళ్యాణ్ వస్తారని తెలిపారు. రాత్రి తిరుమల కు చేరుకుంటారు. రెండవ తేది తిరుమలలోని ప్రధాన ప్రాంతాలను పవన్ కళ్యాణ్ పరిశీలిస్తారన్నారు.
మూడువ తేదీ తిరుపతిలో జరిగే వారాహి సభ లో పాల్గొంటారు. వారాహి సభను విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. అక్టోబర్ 1 వ తేది ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో నిర్వహించాలని… అక్టోబర్ 2వ తేది నగర సంకీర్తన ఉంటుందని తెలిపారు. అక్టోబర్ 3న ఆలయాల్లో భజన కార్యక్రమం… ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ దీక్షలకు మద్దతుగా నిలవాలని కోరారు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు.