అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురి కాకూడదు.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

-

తెలంగాణలో ప్రభుత్వ భూమి అంగులం కూడా ఆక్రమణకు గురికాకుండా చూసుకోవాలని రెవెన్యూ అధికారులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తహసీల్దారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్యులకు మేలు చేసేలా రాష్ట్ర రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాసిల్దారుల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తామన్నారు. ప్రజలు కోరుకుంటున్న దిశలో రెవెన్యూ వ్యవస్థ పని చేస్తుందా లేదా అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తహసీల్దారులకు రెవెన్యూ ఉద్యోగులకు సూచించారు మంత్రి పొంగులేటి.

రెవెన్యూ కార్యాలయానికి వచ్చే రైతులు, పేదలు, సామాన్యులకు వీలైనంత మేరకు చేయగలిగినంత సహాయం చేయాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా పేద, సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. రైతులకు మేలు జరిగే విధంగా కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు వెల్లడించారు మంత్రి పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Latest news