బ్లాక్ మార్కెట్.. బుక్ మై షో సీఈవోకు మళ్లీ నోటీసులు

-

ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్ మోసాలు, సైబర్ దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. వీటి బారిన పడి చాలా మంది ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులు సైతం డబ్బును పొగొట్టుకుంటన్నారు. బ్యాంకు మోసాలతో పాటు నకిలీ ప్రొడక్ట్స్ సైతం పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో మూవీ చూసేందుకు ఆన్లైన్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేయగా అది ఫ్రాడ్‌గా తేలింది. ఈ ఘటన ‘బుక్ మై’ యాప్‌ ద్వారా జరగడంతో అందరూ షాక్ అయ్యారు.

బుక్ మైలో టికెట్ బుక్కైనా వాటిని బ్లాకులో అమ్ముకుంటున్నట్లు సంస్థపై ఆరోపణలు రావడంతో ఆ కంపెనీ సీఈవో ఆశిశ్ హేమ్ రజినీకి ముంబై పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రాక్ బ్యాడ్ కోల్ట్ ప్లే టికెట్ల విక్రయాల్లో అక్రమాలపై సోమవారం తమ ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.ఈనెల 27న ఆయనకు నోటీసులు ఇవ్వగా తాను ఇంతవరకు స్పందించలేదు. సంస్థ టెక్నికల్ హెడ్‌కు సైతం ఆదివారం నోటీసులు పంపారు. ఇదిలాఉంటే, టికెట్లు బ్లాకులో అమ్ముకున్న వారికి తమకు ఎలాంటి సంబంధం లేదని బుక్ మై షో ఇటీవల స్పందించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news