కేసీఆర్ ఓ పులి..ఆయన ప్రెస్ మీట్ మిస్ అవుతున్నామని బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రైతు దీక్షలో కేసీఆర్ పై ఎంపీ అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి..నీకు విదేశీ పర్యటనలు అవసరం లేదని…కేసీఆర్ ఫాం హౌజ్ కు వెళ్లాలని కోరారు. గజ్వేల్ లో కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదించారంటూ ఆరోపణలు చేశారు.
కేసీఆర్ ఫార్మ్ హౌస్ కి రైతులు అధ్యయనం చేయడానికి పంపించాలని రేవంత్ కు సలహా వస్తున్నట్లు చురకలు అంటించారు. కేసీఆర్ ఉద్యమం నడిపినన్ని రోజులు పులి అని కొనియాడారు. ఇప్పుడు కేసీఆర్ స్పీచ్ మిస్ అవుతున్నామని… పిల్లల మాటలు విని కేసీఆర్ పిల్లి అయ్యారని తెలిపారు బీజేపీ ఎంపీ అరవింద్ ధర్మపూరి. ఇచ్చిన హామీలు మరిచావా? మరిచిపోయినట్లు నటిస్తున్నావా? కాంగ్రెస్ అధికారంలో వచ్చాక 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆగ్రహించారు. రైతులు ఓట్లేస్తే కాంగ్రెస్ గెలిచింది…. రైతులకు అండగా మేముంటాం కాంగ్రెస్ మెడలు వంచుతామని హెచ్చరించారు.