దేవాలయాలు కడితే..బిచ్చగాళ్లం అవుతాం – వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే

-

Wardhannapet Congress MLA KR Nagaraju COMMENTS OVER TEMPLES:  దేవాలయాలు కడితే..బిచ్చగాళ్లం అవుతామంటూ వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హాట్ కామెంట్స్ చేశారు. గుడి కడితే బిచ్చగాళ్ళు అయితరు.. అంటూ వివాదానికి తెరలేపారు వర్ధన్నపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.

CONGRESS, Wardhannapet Congress MLA KR Nagaraju

ఐనవోలు కస్తూర్బా గాంధీ ఆశ్రమపాఠశాలలో విద్యార్థులకు హెల్త్ కార్డులు పంపిణీ చేసే కార్యక్రమంలో ఎమ్మెల్యే నాగరాజు ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ కడియం కావ్య, టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, కలెక్టర్ ప్రావీణ్య కూడా ఉన్నారు. మాదిగలు బ్లాక్ మెయిలర్లు అంటూ చేసిన వివాదం మరవకముందే మరోసారి రెచ్చిపోయిన కేఆర్ నాగరాజు…దేవాలయాలు కడితే..బిచ్చగాళ్లం అవుతామన్నారు.

కలెక్టర్ ప్రావీణ్య, ఎంపీ కావ్య, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావుల ముందే దేవాలయాలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే నాగరాజు…ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. ఇక నాగరాజు వైఖరిపై దళిత సంఘాలు.. హిందూ సంఘాలు మండిపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news