సూపర్ పోస్ట్ ఆఫీస్ స్కీమ్..  నెల నెలా మీ అకౌంట్లలోకి 20 వేలు..!

-

చాలామంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రకరకాల స్కీములలో డబ్బులు పెడుతున్నారు. ఇలా స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రావు. సేవింగ్ స్కీమ్స్ పలు రకాలు ఉన్నాయి. అన్ని వయసుల వారికి సేవింగ్స్ చాలా అవసరం. కాబట్టి పలు ప్రభుత్వ రంగ సంస్థలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండే బోలెడన్ని సేవింగ్స్ స్కీమ్స్ ని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ కూడా అనేక రకాల స్కీములని అందిస్తోంది. 60 తర్వాత పని చేసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందే డబ్బులు దాచుకోవడం మంచిది.

పదవీ విరమణ తర్వాత నెలవారి ఆదాయం పొందడం అంత ఈజీ కాదు. ఇక ఈ స్కీమ్ పేరు వచ్చేసి సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీం. ఐదేళ్ల మెచ్యూరిటీ ఉండే ఈ స్కీం ద్వారా రిటైర్మెంట్ సమయంలో స్థిరమైన ఆదాయం పొందవచ్చు. రిటైర్మెంట్ ప్లానింగ్ కి పరిష్కారాన్ని అందించే కేంద్ర ప్రభుత్వంచే నిర్వహించబడిన చిన్న పొదుపు పథకం ఇది. ప్రతి నెల 20వేల వరకు ఈ స్కీం ద్వారా పొందొచ్చు.

ఈ స్కీం వడ్డీ వచ్చేసి 8.2 శాతం గా ఉంది. ఐదు సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధిని కలిగి ఉంది. 60 తర్వాత భారతీయ పౌరులు ఎవరైనా ఈ స్కీమ్ లో చేరొచ్చు. ఈ పథకంలో గరిష్ట పెట్టుబడి 30 లక్షలు. గతంలో 15 లక్షలు మాత్రమే ఉండేది.. 30 లక్షల పెడితే ప్రతి సంవత్సరం దాదాపు రెండు లక్షల 46000 వస్తుంది. ఈ మొత్తాన్ని నెలవారి ప్రాతిపదికను లెక్కిస్తే 20,500 అవుతుంది 55 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్నవాళ్లు కూడా ఈ ఖాతాను ఓపెన్ చేయొచ్చు ఇలా ఈ స్కీం ద్వారా ప్రతీ నెలా 20,000 పైనే పొందడానికి అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news