800 చెరువుల కబ్జాలు బీఆర్ఎస్ నేతలవే.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణలో మూసీ, హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 800 చెరువులను కబ్జా చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే వారికే హైడ్రా అంటే భయం అంటూ కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నాడో కేటీఆర్ చెప్పాలి. ఆయన ఏం చదువుకున్నాడో అని అనుమానం వస్తోంది.

800 చెరువుల కబ్జాలు బీఆర్ఎస్ నేతలవే..వారికే ఇప్పుడు భయం వేస్తుందన్నారు. హైడ్రాకు, మూసీకి రాహుల్ గాంధీకి సంబంధం లేదు.. హైదరాబాద్ పరిధిలోని చెరువులకు పూర్వ వైభవం తెస్తామన్నారు. మూసీ పై డీపీఆర్ సిద్దం కానప్పుడు అవినీతి ఎలా జరుగుతుందన్నారు. 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళనకు సిద్దంగా ఉంది. మూసీ ప్రవాహానికి అడ్డుగా ఉన్న వాటిని మాత్రమే తొలగిస్తున్నారు. బయట రాష్ట్రంలో వీడియోలు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. హైడ్రా పని వేరు.. మూసీ ప్రాజెక్ట్ వేరు అని కామెంట్స్ చేశారు మహేష్ కుమార్ గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news