రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం.. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

-

రైతులకు భరోసా ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని బీజేపీ శాసన సభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా పంట నష్ట పరిహారాన్ని వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పొందుపరిచిందని గుర్తు చేశారు. రైతులకు కనీస భరోసా ఇవ్వలేని స్తితిలో సర్కార్ ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత జిల్లా ఖమ్మం ప్రజలకు కూడా పంట పరిహారం ఇప్పించలేని స్థితిలో మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఉన్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ అయిందంటూ సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారని ఆక్షేపించారు. మరోవైపు మంత్రి తుమ్మల రూ.13వేల కోట్లను త్వరలోనే రుణమాఫీ కింద విడుదల చేస్తామని స్టేట్ మెంట్స్ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇక్కడ ఎవ్వరూ అబద్దాలు ఆడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో ఇప్పటివరకు మంత్రులకే క్లారిటీ లేదని ఫైర్ అయ్యారు.

 

Read more RELATED
Recommended to you

Latest news