డిసెంబర్ 2025 నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి : సీఎం చంద్రబాబు

-

డిసెంబర్ 2025 నాటికి బందర్ పోర్ట్ నిర్మాణం పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా  పోర్టు పనుల పురోగతి పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పోర్టు పనులను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మచిలీపట్నంను అభివృద్ది చేస్తామని హామీ ఇచ్చారు. పోర్టుకు అనుసంధానంగా వచ్చే పరివ్రమలను ఆహ్వానిస్తామని తెలిపారు. 

చెత్త పన్నును రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ముందుకు వెళ్లాలి. 2029 నాటికి ఈ లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. ప్రతీ ఒక్కరూ స్వచ్ఛ సేవకులు కావాలని సూచించారు. భవిష్యత్ లో రోడ్ల పై చెత్త, చెదారం ఉండకూడదు అని సూచించారు. ప్రజల ఆరోగ్యం బాగుందంటే.. దానికి కారణం స్వచ్ఛ సేవకులే అన్నారు. కొందరూ స్వార్థ పరులు ఆంధ్ర జాతీయ కళాశాలను కబ్జా చేశారు. ప్రభుత్వం దానిని స్వాధీనం చేసుకుంటుందని తెలిపారు. జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య పేరిట వైద్యకళాశాల ఏర్పాటు చేస్తామని తెలిపారు చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news