జర్నలిస్టు చిలుక ప్రవీణ్ పై దాడి.. స్పందించిన కేటీఆర్..!

-

ఈ మధ్య కాలంలో జర్నలిస్టులపై దాడులు రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లిలో  ఎంత మంది రైతులకు రుణమాఫీ జరిగిందని తెలుసుకునేందుకు  కొంత మంది జర్నలిస్టులు విధుల్లో భాగంగా వెళ్లగా.. వారిపై కొందరూ కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారు. ఆ సంఘటన అప్పట్లో సంచలనంగా మారింది. తాజాగా జర్నలిస్టు చిలుక ప్రవీణ్ పై కూడా దాడి చేశారు.

గురువారం ఉదయం విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా.. జర్నలిస్ట్ చిలుక ప్రవీణ్ పై దాడి చేశారు కాంగ్రెస్ నేతలు. ప్రస్తుతం ప్రవీణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జర్నలిస్ట్ ప్రవీణ్ పై దాడి విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా  స్పందించారు. కాంగ్రెస్ గూండాలు జర్నలిస్ట్ ప్రవీణ్ పై విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నాను. ఇదేమి రాజ్యం..? ఇదేమి దౌర్జన్యం..? ప్రజా పాలన అంటే ప్రశ్నించే వారిపై దాడులు చేయడమేనా..? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. భౌతిక దాడులకు తెగబడుతారా..? జర్నలిస్ట్ ప్రవీణ్ పై దాడి చేసిన గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలి” అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news