అన్ని సబ్సిడీ పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తాం – మంత్రి తుమ్మల

-

పదేళ్లు అధికారంలో ఉండి రైతు రుణమాఫీ గురించి ఏనాడు పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని మండిపడ్డారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. శుక్రవారం కామారెడ్డి జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు.

కష్టమైనప్పటికీ ఒక పథకాన్ని ఆపైనా సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామన్నారు మంత్రి తుమ్మల. అంతేకాదు అన్ని సబ్సిడీ పథకాలను మళ్లీ పునరుద్ధరిస్తామన్నారు. కచ్చితంగా రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి తీరుతామన్నారు. ఏ ఒక్క రైతు అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారు. భారతదేశంలో ఎక్కువ పంటలను సాగు చేసే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని.. మన రాష్ట్రంలో ఒక కోటి 45 లక్షల టన్నుల వరి ధాన్యం పండిస్తున్నామని తెలిపారు.

ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు మంత్రి తుమ్మల. ఈ సీజన్ లో రైతులు ఎక్కువగా సన్నధాన్యాన్ని పండించారని తెలిపారు. 500 రూపాయలు అదనంగా ఇచ్చి సన్నధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news