సికింద్రాబాద్‌లో కానరాని ప్లాట్‌ఫామ్..ఇసకేస్తే రాలనంత జనం!

-

దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణలోని బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లు అన్ని ప్రయాణికుల రద్దీతో కలకలలాడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించారు. త్వరలో ప్రభుత్వ కార్యాలయాలకు సైతం హాలీడేస్‌ ఉంటాయి. దీంతో ఇప్పటికే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వద్ద భారీగా జనసందోహం నెలకొంది. నగర ప్రజలంతా సొంతూర్లకు పయనం అవుతున్నారు.

ఈ క్రమంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద భారీగా రష్ నెలకొంది. టికెట్ కౌంటర్ల వద్ద జనాలు బారులు తీరారు. ఇక రైల్వే స్టేషన్ లోని ప్లాట్ ఫామ్స్ మీద ఇసకేస్తే రాలనంత జనాలు ఉన్నారు. వేలాది మంది ప్రయాణికులు ప్లాట్ ఫామ్స్‌పై తమ గమ్యస్థానానికి చేరుకునే రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులు, ప్రజలు, పిల్లలతో కలిసి అంతా ఊర్లకు వెళ్లిపోతున్నారు.అయితే, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news