ఆఫ్రికాలో ఊచకోత.. ఒకేసారి 600 మందిపై కాల్పులు!

-

ఆఫ్రికా దేశంలో మరోసారి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. అక్కడి బుర్కినా ఫాసోలో కొందరు టెర్రరిస్టులు వందల మంది ఊచకోత కోశారు. కనిపించిన వారిపై కాల్పులు జరిపారు. ఈ భయానక ఘటనలో సుమారు 600 మంది మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా విస్మయానికి గురిచేసింది. ఆఫ్రికాలోని బర్సాలోగోలో అల్ ఖైదా అనుబంధ ఉగ్రసంస్థ జేఎన్ఐఎం దాడుల్లో గంటల వ్యవధిలోనే ఆరు వందల మంది అమాయక ప్రజలు చనిపోయారు.

ఆగస్టు 24న జరిగిన ఈ మారణహోమం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ద్విచక్రవాహనాలపై వచ్చిన టెర్రరిస్టులు కనిపించిని వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో మరణించిన వారి మృతదేహాలు తొలగించడానికి దాదాపు 3 రోజుల సమయం పట్టింది. కాగా, ఆర్మీ, టెర్రరిస్టులకు మధ్య 2015 నుంచి కొనసాగుతున్న ఘర్షణల్లో 20 వేల మంది మరణించినట్లు ఆ దేశం అధికారికంగా ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news